Amit Shah: అమిత్ షా ‘‘రాజకీయ చాణక్యుడు’’.. అఖిలేష్ యాదవ్ పార్టీ నేత ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రశంసలు కురిపించారు. లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న ఈ సమయంలో ఆయన ఇలా ప్రశంసలు కురిపించడం పార్టీ మార్పును సూచిస్తున్నాయి. ఎస్పీ నేత, మాజీ మంత్రి నాదర్ రాయ్ బీజేపీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం మంత్రి అమిత్ షాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అమిత్ షాతో పాటు ఓం ప్రకాష్ రాజ్‌భర్‌తో ఉన్న ఫోటోను నారద్ రాయ్ పంచుకున్నారు. సోమవారం నారద్, అమిత్ షాతో భేటీ అయ్యారు.
Also Read
‘‘ ప్రపంచంలో భారతదేశాన్ని గర్వించేలా చేసిన గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోడీ సంకల్పా్న్ని అనుసరించి, సమాజంలో చివరి వరసలో ఉన్న పేదలకు సాధికారత కల్పించే ఆలోచన, జాతీయవాదాన్ని నేను బలోపేతం చేస్తాను. భారతదేశాన్ని గర్వించేలా చేస్తున్న హోం మంత్రి, రాజకీయ చాణక్యుడు అమిత్ షా జీ, జై జై శ్రీరామ్’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఎస్పీ అభ్యర్థి సనాతన్ పాండేకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో తాను వేదికపై ఉన్నప్పటికీ తన పేరును కూడా పలకలేదని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ఆయన ఆరోపించారు. తనకు అవమానం జరిగిందని సోమవారం ఖోరీ పకడ్ గ్రామంతో జరిగిన సమావేశంలో ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో సైకిల్(ఎస్పీ గుర్తు)కి తాళం వేయాలని ప్రజల మద్దతు కోరారు.
తాజావార్తలు
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!