Site icon NTV Telugu

Akhilesh Yadav: ఇండీ కూటమిపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: ఇండీ కూటమిపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిప ఇండి కూటమి సంకీర్ణం కొనసాగుతుంది ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. వక్ఫ్ బిల్లు ద్వారా మాఫియా లాగా భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఏ (వెనుకబడిన, దళితులు మరియు మైనారిటీలు) రాష్ట్రం నుండి బీజేపీని తరిమికొడతారని అన్నారు. ఇండియా బ్లాక్ భవితవ్యంగా ఆయన మాట్లాడుతూ.. ఇండీ కూటమి ప్రస్తుతం ఉంది, అలాగే ఉంటుందని చెప్పారు. భూమిని లాక్కోవడానికి బీజేపీ వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని, వారు ఎక్కడ చూసినా భూమిని ఆక్రమించుకుంటారు అని అన్నారు. బీజేపీని భూ మాఫియా పార్టీ అని పిలిచారు.

Read Also: Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ దారుణ హత్య.. భార్యపైనే అనుమానం..

బీజేపీ పార్టీ నోట్ల రద్దు, జీఎస్‌టీ ద్వారా ప్రజల డబ్బును కొల్లగొడుతోందని, రిజర్వేషన్ హక్కుల్ని కాలరాస్తోందని ఆరోపించారు. ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళాలో అనేక అవినీతి జరిగిందని, తాము అధికారంలోకి వస్తే నిర్వహణ లోపాలపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. కుంభమేళాలో ప్రాణనష్టం, ఆర్థిక లాభాలకు సంబంధించి ప్రభుత్వం తప్పుడు గణాంకాలను అందిస్తోందని, జనవరిలో జరిగిన తొక్కిసలాట సమయంలో డ్రోన్‌లు, సీసీటీవీ నిఘా విఫలమైందని అఖిలేష్ ఆరోపించారు. తొక్కిసలాట బాధితుల బంధువులు వివరాలు వెల్లడించకుండా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని చెప్పారు.

Exit mobile version