Site icon NTV Telugu

Akhilesh Yadav: ప్రతిపక్ష నేత పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా..

Akilesh Yadav

Akilesh Yadav

Akhilesh Yadav: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు అందర్ని ఆశ్చర్యపరిచాయి. గత రెండు పర్యాయాలుగా యూపీ బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టింది. అయితే, ఈ సారి మాత్రం అక్కడి ప్రజలు బీజేపీకి షాక్ ఇచ్చారు. సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ యాదవ, ముస్లిం ఓట్లనే కాకుండా దళితులను, ఓబీసీలను ఆకర్షించింది. యూపీలోని మొత్తం 80 స్థానాలకు గానూ ఎస్పీ ఏకంగా 37 స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, మిత్రపక్షం కాంగ్రెస్ 06 స్థానాలు గెలిచేందుకు సాయపడింది. బీజేపీ కేవలం 33 సీట్లకు పరిమితమైంది.

READ ALSO: MP Salary: ఎంపీలకు జీతం, ఇతర అలవెన్సులు కలిపి నెలకు ఎంత వస్తుందో తెలుసా?

అఖిలేష్ యాదవ్ కనౌజ్ నుంచి ఆయన భార్య డింపుల్ యాదవ్ మొయిన్‌పురి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఆయన యూపీ అసెంబ్లీలో కర్హాల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా యూపీ అసెంబ్లీలో ఉన్నారు. ఎంపీగా గెలవడంతో ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. ప్రతిపక్ష నేత బాధ్యతలను సీనియర్ నేత శివపాల్ యాదవ్‌కి అప్పగించే అవకాశం ఉంది. కనౌజ్ ఎంపీ స్థానం నుంచి ఏకంగా 6 లక్షల ఓట్లతో సిట్టింగ్ బీజేపీ ఎంపీ సుబ్రత్ పాఠక్‌పై విజయం సాధించారు. ఎస్పీకి కంచుకోటగా ఉన్న కనౌజ్‌ని మరోసారి తిరిగి పొందారు.

Exit mobile version