Ram Temple donation theft: అఖిలేష్ యాదవ్‌తో రామ మందిర చోరీ నిందితుడికి సంబంధాలు.?
- రామ మందిర చోరీ కేసులో టిన్నూ యాదవ్ కాల్ రికార్డులపై దర్యాప్తు.
- అఖిలేష్ యాదవ్‌తో తరచూ ఫోన్ సంభాషణలు జరిగినట్లు సమాచారం.
- కాల్ డీటెయిల్స్‌పై బీజేపీ విమర్శలు, రాజకీయ దుమారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Temple donation theft: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు విచారణకు యోగి సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు రామ మందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాకు ఆమోదం లభించింది. మరోవైపు ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయోధ్య వ్యవహారం రాజకీయ అంశంగా మారింది.
ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ ఏడాది కాలంగా అఖిలేష్ యాదవ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ చీఫ్‌తో తరుచుగా ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు పరిశీలిస్తున్న కాల్ డిటెయిల్ రికార్డ్(సీడీఆర్) సూచిస్తోందని సమాచారం. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పందిస్తూ.. టిన్నూ యాదవ్ అఖిలేష్ యాదవ్‌తో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.
Also Read
టిన్నూ యాదవ్ ప్రతీరోజూ దాదాపు ఒకటి లేదా రెండుసార్లు అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతడి అరెస్టుకు ముందు, టిన్నూ అఖిలేష్‌తో రోజుకు మూడుసార్లు మాట్లాడినట్లు కాల్ రికార్డ్స్ సూచిస్తున్నట్లు సమాచారం. మరో ఆరు నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ చోరీ అంశం బీజేపీ, ఎస్పీల మధ్య రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు అఖిలేష్-టిన్నూ సంబంధాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయని అంతా ఎదురుచూస్తున్నారు.
टिन्नू टीपू से ही तो बात कर रहा था? https://t.co/5YUKARJ8Sv
— Dr Nishikant Dubey (@nishikant_dubey) July 5, 2026
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!