Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!

  • బీజేపీ, ఓవైసీపై అఖిలేష్ పరోక్ష విమర్శలు..
  • రాజకీయ పర్యాటకులకు ఓటీపీలు వేరే చోటు నుంచి వస్తున్నాయని సెటైర్లు..
Up Politics

Up Politics

Akhilesh Yadav:  ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీలు తమ ప్రచారాన్ని తీవ్రం చేశాయి. మూడోసారి అధికారం కోసం బీజేపీ కసరత్తు చేస్తుంటే, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు రాష్ట్రంలో బీజేపీ, ఎస్పీ, మాయావతి బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ ఉండగా, ఇప్పుడు ఎంఐఎం-చంద్రశేఖర్ ఆజాద్ పొత్తుతో పోటీ మరింత పెరిగింది.

ఇదిలా ఉంటే, ఆగ్రాలో జరిగిన దళిత మహాదళిత సమ్మేళన కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పరోక్ష విమర్శలు చేశారు. కొందరు రాజకీయ పర్యాటకుల ఓటీపీలు ఎక్కడి నుంచో వస్తున్నాయని సెటైర్లు వేశారు.

బీజేపీ ఓటమి తర్వాత యూపీకి రాజకీయ పర్యాటకుల రాక పెరిగిందని అఖిలేష్ అన్నారు. ఆగ్రా పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పర్యాటకులు వస్తున్నారని అన్నారు. అయితే, వారి OTP ఓటీపీలు మాత్రం వేరే చోటు నుంచి వస్తున్నాయని ఆరోపించారు. ఇతరుల మైక్రోఫోన్లకు వారు లౌడ్ స్పీకర్లుగా మారిపోయారని అఖిలేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఓవైసీని ఉద్దేశించనవే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, అఖిలేష్ మాత్రం ఓవైసీ పేరును నేరుగా ప్రస్తావించలేదు.