NTV Telugu Site icon

Akhilesh Yadav: ఈ “టీ”లో విషం కలిపితే ఎలా..? పోలీసులు ఇచ్చిన ఛాయ్‌ని నిరాకరించిన అఖిలేష్ యాదవ్

Samajwaadi Party, Akhilesh Yadav

Samajwaadi Party, Akhilesh Yadav

Akhilesh Yadav: సమాజ్ వాదీ పార్టీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లక్నో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిరసనకు దిగారు. ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త మనీస్ జగన్ అగర్వాల్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దీంతో పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లక్నోలోని పోలీస్ ప్రధాన కార్యాలయం మందు నిరసన తెలిపారు. పోలీసులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Mumbai Metro: వైరల్ వీడియో.. యువతిని ఈడ్చుకెళ్లిన మెట్రోరైలు

ఈ నేపథ్యంలో పోలీసులు అఖిలేష్ యాదవ్ కు ‘ టీ ’ ఇవ్వడానికి వెళ్లినప్పుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ యాదవ్. పోలీసులు అందించిన టీ తాగేందుకు నిరాకరించారు. ‘‘ నేను టీ తాగను, దీంట్లో విషం కలిస్తే ఎలా..? మిమ్మల్ని నమ్మను’’ అంటూ అఖిలేష్ యాదవ్ అన్నారు. స్వామి ప్రసాద్ మౌర్య నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మనీష్ జగన్ అగర్వాల్‌ను విడుదల చేయాలని కోరుతూ డీజీపీ ప్రధాన కార్యాలయం గేట్ నంబర్ టూ వెలుపల నిరసన చేపట్టారు.

మనీష్ అగర్వాల్ ను కలిసేందుకు అఖిలేష్ యాదవ్ గోసాయి గంజ్ జిల్లా జైలుకు చేరుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మనీష్ జగన్ అగర్వాల్ పై హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదు అయ్యాయి. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.