Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మరణం తీవ్ర విషాదంగా మారింది. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా అందరూ మరణించారు. దీంతో, మహాయుతి సర్కార్‌లో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన మృతదేహాన్ని పూణేకు తరలించారు. రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.
Read Also: Penguin walk: పెంగ్విన్ ఒంటరి నడక చుట్టూ పిట్ట కథలు.. అంతా ట్రాష్.. అసలు నిజమిదే!
ఢిల్లీకి చెందిన వీఎస్‌ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన లీర్‌జెట్ 46 విమానం ముంబై నుండి బయలుదేరిన 35 నిమిషాల తర్వాత, ఉదయం 8:45 గంటల ప్రాంతంలో కూలిపోయింది. మరణించిన వారిలో పవార్ పీఎస్‌ఓ, సహాయకుడు, ఇద్దరు సిబ్బంది (ప్రధాన పైలట్ మరియు ఫస్ట్ ఆఫీసర్) ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ల్యాండింగ్ అవుతున్నప్పుడు అదుపుతప్పి కూలిపోయినట్లు తెలుస్తోంది.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, పవార్ మృతదేహాన్ని ఆయన చేతి గడియారం ద్వారా గుర్తించారు. ఎన్సీపీ అధికారి ఎన్నికల గుర్తు కూడా గడియారమే. 66 ఏళ్ల పవార్, ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం బారామతి వెళ్లారు. మరికొన్ని క్షణాల్లో ల్యాండ్ కావాల్సిన విమానం, ప్రమాదంతో ముగిసింది.
