Anand Mahindra: ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే చాలు.. హారన్ల మోత మోగాల్సిందే.. చివరకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ పడినా సరే.. వెనక నుంచి హారన్లు ఓ రేంజ్‌లో మోగుతుంటాయి.. ఇక, ఆగాల్సిన పరిస్థితే వస్తే.. రాంగ్ రూట్‌లోనైనా సరే దూసుకెళ్తారు.. అయితే మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడినా వాహనదారులు సహనంతో తమ వంతు కోసం వేచి ఉంటారు. అనవసరంగా హారన్ కొట్టరు. ఈ క్రమశిక్షణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. అక్కడి ట్రాఫిక్ క్రమశిక్షణ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడిపోయింది.. ఏదైనా కాస్త వెరైటీగా.. ఆలోచింపజేసేది కనబడినా షేర్ చేసే ఆయన.. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు..
ఐజ్వాల్ ట్రాఫిక్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో ఐజ్వాల్ ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ఊహించలేని విధంగా అక్కడి ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్న తీరు వీడియోలో కనిపిస్తుంది. రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోయినా ఎక్కడా హారన్ల శబ్దం వినిపించదు. వాహనాలన్నీ తమకు కేటాయించిన లేన్లలోనే ఉంటూ సిగ్నల్ కోసం ప్రశాంతంగా ఎదురుచూస్తుంటాయి.
రెండు మూడు గంటల జామ్‌లోనూ అదే క్రమశిక్షణ
ఇక, ఆ వీడియోలో ఓ మహిళ ఐజ్వాల్ ట్రాఫిక్ సంస్కృతి గురించి వివరిస్తుంది. మిజో ప్రజలు సహనంతో ఉంటారని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారని ఆమె చెబుతుంది. రోడ్డుపై ఉన్న తెల్ల గీతను చూపిస్తూ.. వాహనదారులు తమ వంతు వచ్చే వరకు ఆ గీతను దాటి ముందుకు వెళ్లరని వివరిస్తుంది. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడినా ఎవరూ అనవసరంగా హారన్ కొట్టకుండా ప్రశాంతంగా వేచి ఉంటారని పేర్కొంది.
ఇతర నగరాల ప్రజలకు ఐజ్వాల్ ఆదర్శం కావాలి
ట్రాఫిక్ రద్దీ సమయంలో నిరంతరం హారన్లు మోగించడం వల్ల శబ్ద కాలుష్యం పెరుగుతుందని ఆ మహిళ అభిప్రాయపడింది. ఇతర భారతీయ నగరాల ప్రజలు కూడా ఐజ్వాల్ ట్రాఫిక్ సంస్కృతిని ఆదర్శంగా తీసుకోవాలని కోరింది. రోడ్లపై క్రమశిక్షణ, సహనం పాటిస్తే ట్రాఫిక్ సమస్యలతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని ఈ వీడియో సందేశమిస్తోంది.
2017లోనే నో-హారన్ విధానం అమలు
ఆనంద్ మహీంద్రా తన పోస్టులో ఐజ్వాల్ ట్రాఫిక్ క్రమశిక్షణ గురించి గతంలోనూ ప్రస్తావించినట్లు తెలిపారు. ముఖ్యంగా నగరంలోని నో-హారన్ విధానం, లేన్ క్రమశిక్షణను ప్రశంసించారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో 2017లోనే నో-హారన్ విధానాన్ని అమలు చేశారు. రోడ్లపై అనవసరమైన హారన్లను అరికట్టడం, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ట్రాఫిక్‌లో సహనం, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఐజ్వాల్ ప్రజలు తమ ఆచరణతో చూపిస్తున్నారు. మొత్తంగా.. హారన్ల మోత లేకుండా.. ట్రాఫిక్ రూల్స్‌ను వంద శాతం పాటిస్తూ.. ముందుకు సాగుతోన్న ఐజ్వాల్ వాసులు అందరికీ ఆదర్శం.. ఇలాంటి వీడియోలు ప్రజల్లో చైతన్యం కల్పించి.. అందరూ రూల్స్ పాటిస్తే ఎంతో బాగుంటుంది మరి..
I’ve posted before about the remarkable traffic discipline of the people of Aizawl, their respect for lane etiquette and the city’s no-honking policy introduced in 2017.
Today, I find myself reflecting on the outcome of that collective discipline, which this lady speaks of with such pride: the quietness of her city.
In our bustling metropolises, quietness has become a rare luxury.
As travellers, we have traditionally looked for breathtaking landscapes and magnificent monuments.
But for the #SundayWanderer in me, & I bet for many others, the ‘quest for quiet’ may well become the most compelling reason to travel.
(Video courtesy @RajeshwariRW)
— anand mahindra (@anandmahindra) November 22, 2026

