NTV Telugu Site icon

Airtel: స్పేస్ ఎక్స్‌‌తో ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్..

Airtel

Airtel

Airtel: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్‌తో భారతీ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ వెల్లడించింది. భారతదేశంలో స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను తీసుకురావడానికి ఎయిర్‌టెల్ స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. “భారతదేశంలోని ఎయిర్‌టెల్ కస్టమర్లకు స్టార్‌లింక్‌ను అందించడానికి స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేయడం ఒక ముఖ్యమైన మైలురాయి, నెక్ట్స్ జనరేషన్ ఉపగ్రహ కనెక్టివిటీకి మా నిబద్ధతను మరింత ఇది ప్రదర్శిస్తుంది” అని భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ అన్నారు.

Read Also: Airtel: స్పేస్ ఎక్స్‌‌తో ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్..

ఎయిర్‌టెల్ స్టోర్లలో స్టార్ లింక్ పరికరాలను విక్రయించే అవకాశం ఉంది. గ్రామీణ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మారుమూల ప్రాంతాలకు, వ్యాపారాలకు ఇంటర్నెట్ తీసుకురావాలని స్టార్‌లింక్‌ని ఉపయోగించాలని యోగిస్తున్నారు. ఎయిర్ టెల్ నెట్వర్క్‌కి స్టార్ లింక్ ఎలాం మద్దతు ఇవ్వగలదో, భారత్‌లో ఎయిర్‌టెల్ మౌలిక సదుపాయాలను స్పేస్ ఎక్స్ ఎలా ఉపయోగించుకోలగదనే అంశాలను రెండు సంస్థలు అన్వేషించనున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం యూటెల్‌సాట్ వన్‌వెబ్‌తో కలిసి పనిచేస్తోంది. స్టార్‌లింక్‌ని తీసుకురావడం వల్ల తమ కవరేజీని ఇంటర్నెట్ తక్కువగా ఉన్న, అసలు లేని ప్రాంతాలకు విస్తరించడానికి సాయపడుతుందని భావిస్తోంది.

స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్ మాట్లాడుతూ, “ఎయిర్‌టెల్‌తో కలిసి పనిచేయడానికి, స్టార్‌లింక్ భారతదేశ ప్రజలకు తీసుకురాగల పరివర్తన ప్రభావాన్ని అన్‌లాక్ చేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. స్టార్‌లింక్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు ప్రజలు, వ్యాపారాలు, సంస్థలు చేసే అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయకమైన పనులను చూసి మేము నిరంతరం ఆశ్చర్యపోతాము. ” అని అన్నారు.