Air India: శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఆదివారం మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ముందస్తు జాగ్రత్త చర్యగా ల్యాండింగ్ చేసిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. కోల్‌కతా మీదుగా నడుస్తున్న ఈ విమానం AI174 ఉలాన్‌బాతర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుతం, సాంకేతిక తనిఖీలు జరుగుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
Read Also: SSMB 29 : మహేశ్ మూవీకి టైటిల్ ఇష్యూ.. రాజమౌళికి ఏం చేస్తాడో..?
‘‘ప్రయాణికులకు సాయం చేయడానికి మేము మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. వీలైనంత త్వరగా అందరిని గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఉహించని పరిస్థితి కారణంగా ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి చింతిస్తు్న్నాము. ఎయిర్ ఇండియా ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది’’ అని ఎయిర్ లైన్ ప్రతినిధి అన్నారు. దీనికి ముందు జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బెదిరింపులు రావడంతో శనివారం ముంబైకి మళ్లించారు. తనిఖీలు జరిగిన తర్వాత తప్పుడు బెదిరింపులుగా అధికారులు తేల్చారు.
