NTV Telugu Site icon

Air India: ఎయిర్ ఇండియా కు మాలేలో ఘ‌న స్వాగ‌తం…ఎందుకంటే…

ఎయిర్ ఇండియాను టాటా కంపెనీ సొంతం చేసుకున్న త‌రువాత వివిధ దేశాల‌కు స‌ర్వీసుల‌ను పునుద్ద‌రించిన సంగ‌తి తెలిసిందే. ఎయిర్ ఇండియా సంస్థ గ‌త 46 ఏళ్లుగా మాలేకు రెగ్యుల‌ర్‌గా విమానాల‌ను న‌డుపుతున్న‌ది. ఇండియాలోని కేర‌ళ నుంచి ఎక్కువ విమానాలు మాలేకు న‌డుస్తుంటాయి. దేశంలోని మిగ‌తా అంత‌ర్జాతీయ విమానాశ్రాయాల నుంచి స‌ర్వీసులు న‌డుస్తున్నా, కేర‌ళ నుంచే అధికంగా స‌ర్వీసులు న‌డుస్తుంటాయి. 1976 నుంచి క్ర‌మం తప్ప‌కుండా స‌ర్వీసులు న‌డుస్తున్నాయి. నేటికి 46 ఏళ్లు పూర్తికావ‌డంతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబ‌ర్ 267 విమానాన్ని వాట‌ర్ కెనాన్ తో స్వాగ‌తం ప‌లికారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read: 2024 Elections: ఎన్టీఆర్ సాధించనిది కేసీఆర్ సాధిస్తారా?