Air India: అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదం తర్వాత, ఈ రోజు ఎయిరిండియా రెండు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలలో సాంకేతిక సమస్యలు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్-లండన్, ఢిల్లీ -పారిస్ మధ్య నడిచే రెండు విమానాలను మంగళవారం రద్దు చేశారు.
Read Also: Se*xual Assault: జైలు నుండి విడుదలై రెండు రోజులు కాలేదు.. 80 ఏళ్ల వృద్ధ మహిళపై అత్యాచారం..!
‘‘మా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. వీలైనంత త్వరగా వారిని వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. మేము హోటల్ వసతిని అందిస్తున్నాము. ప్రయాణీకులు టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపసు లేదా ఉచిత రీషెడ్యూలింగ్‌ను కూడా అందిస్తున్నాము’’అని ఎయిరిండియా ప్రకటించింది.
ఇటీవల, అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం కూడా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందినది కావడం గమనార్హం. గత వారం జరిగిన ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో నేలపై ఉన్న 33 మంది కూడా మరణించారు. ఈ ఘటనపై భారత అధికారులతో పాటు బ్రిటన్, అమెరికా అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
