NTV Telugu Site icon

Air India: పలు కొత్త మార్గాలలో ఎయిర్ఇండియా సర్వీసులు ప్రారంభం..

Air India

Air India

Air India: ఎయిర్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆదివారం నుంచి పలు కొత్త మార్గాలలో విమాన సర్వీసులను స్టార్ట్ చేసింది. వీటిలో విజయవాడ-బెంగళూరు, హైదరాబాద్- గౌహతి, బెంగళూరు- ఇండోర్ లు ఉన్నాయి. వీటిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం కోసం ఎన్డీయే సర్కార్ కట్టుబడి ఉందని తెలిపారు.

Read Also: NBK50inTFI : బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలని కోరిక : మెగాస్టార్ చిరు

అయితే, ఈ సేవలు వ్యాపారులకు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా.. విజయవాడ పరిసర ప్రాంతాల ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి కనెక్టివిటీని మెరుగు పరచడానికి ఎయిర్ ఇండియా చేస్తున్న కృషికి తాను అభినందిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు వెల్లడించారు. అలాగే, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ మాట్లాడుతూ.. విజయవాడ ఎయిర్ పోర్టు విజయానికి మేము తోడ్పడడం పట్ల సంతోషిస్తున్నాం.. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు విస్తరించామన్నారు. అలాగే ఒక అంతర్జాతీయ గమ్యస్థానం షార్జాతో ఈ సేవలను కలుపుతున్నామన్నారు.