Site icon NTV Telugu

Air India Flight: ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపు..

Air India

Air India

Air India Flight: Air India Flight: గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటన మరిచిపోక ముందే.. ఇంతలో మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, వివరాల్లోకి వెళితే.. పుకెట్‌ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో.. అప్రమత్తమైన అధికారులు థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేసినట్లు థాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ వెల్లడించింది. కాగా, ఈ విమానంలో 156 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బెదిరింపు కాల్‌ తర్వాత ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపి.. ఫ్లైట్ లో మొత్తం తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.

Read Also: Lone survivor: మృత్యుంజయుడు.. విమానం నుంచి ప్రాణాలతో ఇలా బయటపడ్డాడు..

అయితే, విమానం గాల్లో ఉండగానే బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.. దాంతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ అధికారుల సూచనతో పైలెట్‌ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారని తెలిపారు. విమానం అండమాన్‌ సముద్రం చుట్టూ చక్కెర్లు కొట్టి లాస్ట్ కి ఐలాండ్‌లో సురక్షితంగా దిగిందని చెప్పుకొచ్చారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారని, అందులో ఎలాంటి బాంబుల ఆచూకీ లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని థాయ్‌లాండ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ చెప్పింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ప్రకటించింది.

Exit mobile version