Air India Fined 30 Lakhs, Pilot’s Licence Suspended For 3 Months: గతేడాది నవంబర్ నెలలో న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో ఓ ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన సంఘటనలో దేశ విమానయాన రంగంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై విమానయాన రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై ఆగ్రహంతో ఉంది. ఈ మేరకు డీజీసీఏ చర్యలు ప్రారంభించింది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు పైలెట్ నిర్లక్ష్యం కూడా ఉండటంతో అతని లైసెన్స్ ను మూడు నెలలు సస్పెండ్ చేసింది. ఎయిరిండియా డైరెక్టర్ కు రూ. 3 లక్షల జరిమానా విధించింది.
Read Also: Delhi: ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్‌కు వేధింపులు.. వీడియో వైరల్
ఈ ఘటనకు పాల్పడిన శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నాలుగు నెలలు పాటు విమానయాన నిషేధాన్ని విధిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇతడిపై 30 రోజుల పాటు నిషేధాన్ని విధించింది. ఇప్పుడు విధించిన నిషేధం దీనికి అదనం. ఇదిలా ఉంటే చాలా రోజుల పాటు తప్పించుకుని తిరిగిని నిందితుడు శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో తాను మూత్రవిసర్జన చేయలేదని, సదరు మహిళే మూత్రవిసర్జన చేసుకుందని ఆరోపించాడు.
ఈ వివాదంపై నవంబర్ 27న సదరు మహిళ ఎయిరిండియా కు ఫిర్యాదు చేసుకుంది. ఎయిరిండియా దీనిపై జనవరి 4న పోలీసుకు ఫిర్యాదు చేసింది. జనవరి 5న డీజీసీఏ, ఎయిరిండియాకు షాకాజ్ నోటీసులు జారీ చేసి, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. ఈ ఘటన తర్వాత విమానంలో వికృతంగా ప్రవర్తించే వారిపట్ల చర్యలు తీసుకోవడంపై డీజీసీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది, పైలెట్ల బాధ్యతల గురించి వివరించింది.