NTV Telugu Site icon

Air India: ఇజ్రాయిల్ వెళ్లే విమానాలపై ఎయిర్ ఇండియా సస్పెన్షన్ కొనసాగింపు..

Air India

Air India

Air India: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకునేలా చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య చేయబడటంపై ఇరాన్ రగిలిపోతోంది. ఈ హత్యకు తామే కారణమని ఇజ్రాయిల్ ప్రకటించనప్పటికీ, ఇది ఇజ్రాయిల్ పనే అని ఇరాన్, హమాస్, హిజ్బుల్లా ఆరోపించింది. ఈ హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుందని చెప్పింది. మరోవైపు లెబనాన్ లోని హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ని ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హతం చేయడం పరిస్థితి తీవ్రతను పెంచింది.

Read Also: Mohammed Siraj: క్రికెట‌ర్ మ‌హ్మద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్లో ఇంటి స్థలం కేటాయింపు..

ఇదిలా ఉంటే ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్‌కి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా చెప్పింది. శుక్రవారం ఈ సస్పెన్షన్‌ని పొడగిస్తున్నట్లు ప్రకటించింది. “మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, టెల్ అవీవ్‌కు మరియు బయలుదేరే మా విమానాల షెడ్యూల్ తదుపరి నోటీసు వచ్చేవరకు తక్షణమే నిలిపివేయబడింది” అని ఎయిర్ ఇండియా ఎక్స్‌లో ట్వీట్ చేసింది. అంతకుముందు, ఆగస్టు 2న, మిడిల్-ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్‌కు మరియు బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేసింది. జూలై 08 వరకు రద్దు కొనసాగుతుందని ప్రకటించింది. ఈ రోజు మరిన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది.

Show comments