Site icon NTV Telugu

Air India:న్యూఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపులు.. కెనడాకు దారి మళ్లింపు..

Air India

Air India

Air India: ఆన్‌లైన్‌లో బెదిరింపులు రావడంతో న్యూఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా డైరెక్ట్ ఫ్లైట్‌ని కెనడాలోని ఇకల్యూబ్ ఎయిర్‌పోర్టుకి మళ్లించారు. ‘‘అక్టోబర్ 15, 2024న ఢిల్లీ నుంచి చికాగోకి వెళ్తున్న AI127 విమానం ఆన్‌లైన్‌లో భద్రతాపరమైన ముప్పును కలిగి ఉంది మరియు ముందుజాగ్రత్త చర్యగా కెనడాలోని ఇకాలూయిట్ విమానాశ్రయంలో దిగింది.’’ అని ఎయిర్‌లైన్ తెలిపింది. ‘‘ విమానం, ప్రయాణీకులు భద్రతా ప్రోటోకాల్ ప్రకారం తిరిగి తనిఖీ చేయబడుతున్నారు. ఎయిర్ ఇండియా వారి ప్రయాణం పున:ప్రారంభించే వరకు ప్రయాణికులకు సాయం చేయడానికి అన్ని ఏజెన్సీలను యాక్టివేట్ చేశాము’’ అని తెలిపింది.

Exit mobile version