Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ వెల్లడైంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 32 సెకన్ల లోపే ‘‘ఇంధన నియంత్రణ స్విచ్’’ల సమస్య తలెత్తినట్లు తెలిపింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంతోనే ఇంజన్లకు ఇంధనం అందడం లేదని పేర్కొంది. ఈ సమయంలో కాక్‌పిట్‌లో పైలట్లు మాట్లాడుకుంటూ.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశామని ఒకరు ప్రశ్నించగా, మరొకరు నేను అలా చేయలేదని సమాధానం ఇచ్చారు. మొత్తంగా , ఇంధన నియంత్రణ స్విచ్‌లు వాటి అంతటా అవే ఆఫ్ అయినట్లు నివేదిక ప్రస్తావించింది.
దీనిపై, భారత పైలట్ల సమాఖ్య అధ్యక్షుడు చరణ్‌వీర్ సింగ్ రాంధవా ఆదివారం స్పందించారు. ఎయిర్ ఇండియా AI171 క్రాష్‌పై ప్రాథమిక నివేదికపై సందేహాలను లేవనెత్తారు. కాక్‌పిట్‌లోని కంట్రోల్స్ ఎవరు తీసుకున్నారనే దాన్ని నివేదిక స్పష్టం చేయలేదని అన్నారు. విమానంలో విద్యుత్ లేదా సాఫ్ట్‌వేర్ పనిచేయలేదని సూచిస్తున్నట్లు చెప్పారు. ఏఎన్ఐతో మాట్లాడినా రాంధవా.. ‘‘వాస్తవానికి విమానాన్ని నడుపుతున్నది కో-పైలట్, పైలట్-ఇన్-కమాండ్ అయిన కెప్టెన్ విమానాన్ని పర్యవేక్షిస్తున్నాడు. కాబట్టి, కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారో ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుండి ఎవరు మాట్లాడుతున్నారో గుర్తించడం సులభం అయినప్పటికీ, ప్రాథమిక నివేదిక దానిని స్పష్టంగా చెప్పలేదు’’ అని చెప్పారు.
Read Also: Chhangur Baba: హిందూ అమ్మాయిలను వలలో వేయడానికి 1000 మంది ముస్లిం యువకులకు నిధులు..
ఇంధన నియంత్రణ స్విచ్‌లు కటాఫ్ నుండి రన్ వరకు వాటంతట అవే స్థానం మార్చుకున్నాయని నివేదికలో కూడా పేర్కొన్నారు. ఇది విద్యుత్ లేదా సాఫ్ట్‌వేర్ లోపం జరిగి ఉండవచ్చని సూచిస్తుంది. ఎవరూ భౌతికంగా తాకనప్పటికీ, ఇంధన నియంత్రణ స్విచ్ కదిలిందని సిస్టమ్ గుర్తించినట్లు అనిపిస్తుందని చెప్పారు. గతంలో 2018లో బోయింగ్ 737 విమానంలో కూడా ఇంధన నియంత్రణ స్విచ్‌లు పనిచేయకపోవడాన్ని గుర్తించిన విషయాన్ని రాంధవా గుర్తు చేశారు.
రెండు ఇంజన్లు విఫలమైతే తప్పా, పైటల్లు స్విచ్‌లను ముట్టరని రాంధవా అన్నారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) ప్రకారం, స్విచ్‌లను ఎవరూ మార్చలేదని స్పష్టం అవుతోందని చెప్పారు. ఒక వేళ ఇవి స్విచ్చులు మారితే ఇది ఎలక్ట్రానిక్ వ్యవస్థలో సాధ్యమయ్యే సమస్యను సూచిస్తుందని పైలట్లు చెబుతున్నారు.
