Air India Crash: జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఈ విమానం, టేకాఫ్ అయన 30 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులే కాకుండా నేలపై ఉన్న పలువురు మరణించారు. అయితే, దర్యాప్తులో ఇంజన్ ఇంధన నియంత్రణ స్విచ్‌లపై పరిశోధకులు దృష్టి సారించిందని ప్రముఖ ఏవియేషన్ జర్నల్ ది ఎయిర్ కరెంట్‌లోని ఒక నివేదిక పేర్కొంది. భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బోర్డు (AAIB) దాని AI-171 దర్యాప్తు యొక్క ప్రాథమిక నివేదికను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ కథనం వచ్చింది.
Read Also: Bangladesh: ఆందోళనకారుల్ని “కాల్చి వేయాలని” షేక్ హసీనా ఆదేశాలు..
అయితే, భారత్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) సభ్యుడిగా ఉన్నందున 30 రోజుల్లోపే నివేదిక ఇవ్వాల్సి ఉంది. జూలై 11లోపు నివేదిక విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఫ్యూయల్ కంట్రోల్‌ని పైలట్లలో ఒకరు అనుకోకుండా ఒక ఇంజన్‌కి సరఫరా నిలిపివేశారా..? అని అనుమానిస్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఒక ఇంజన్ ఫెయిల్యూర్ కావడంతో, పైలట్ అనుకోకుండా మరో ఇంజన్ ఇంధన సరఫరాని నిలిపేయవచ్చని ఊహిస్తున్నారు.
సాధారణంగా చెప్పాలంటే, ఒక ఇంజన్ పనిచేయని సమయంలో దానికి ఇంధన సరఫరాని నిలిపివేయడం చేస్తుంటారు. అయితే, ఆ సమయంలో పైలట్లు పొరపాటును నడిచే ఇంజన్‌కు ఇంధనాన్ని నిలిపేసే స్విచ్ ఆఫ్ చేశారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఎత్తు తక్కువగా ఉండటంతో విమానం మళ్లీ టేకాఫ్ తీసుకోలేకపోయినట్లు అనుమానిస్తున్నారు.
