Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, భారతదేశ వైమానిక రంగంలోనే అత్యంత దారుణమైన దుర్ఘటనగా మిగిలిపోయింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లే బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కుప్పకూలింది. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు నేలపై ఉన్న పలువురితో కలిపి 270 మంది వరకు మరణించారు. అయితే, దీనిపై తాజాగా ప్రభుత్వం ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల తప్పిదంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా విమానం సెకన్ టూ సెకన్ వివరాలు:
* జూన్ 12 ఉదయం 11:17 గంటలు: ఎయిరిండియా (Air India) డ్రీమ్‌లైనర్ వీటీ-ఏఎన్‌బీ విమానం దిల్లీ నుంచి అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయ్యింది
* మధ్యాహ్నం 1:10:38 గంటలు: విమానాశ్రయంలోని బే34 నుంచి బయల్దేరేందుకు సిద్ధమైంది
* మధ్యాహ్నం 1:25:15 గంటలు: ట్యాక్సీ క్లియరెన్స్ కోరగా.. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది. ఒక నిమిషం తర్వాత విమానం బే34 నుంచి ఆర్4 ట్యాక్సీవే మార్గంలో 23వ రన్‌వే పైకి చేరుకుంది. అక్కడి నుంచి టేకాఫ్‌కు సిద్ధమైంది
* మధ్యాహ్నం 1:32:03 గంటలు: విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్‌కు మారింది
* 01:37:33 గంటలు: టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయ్యింది
* 01:37:37 గంటలు: విమానం టేకాఫ్ ప్రారంభించింది
* 01:38:39 గంటలు: విమానం ఎయిర్/గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్‌లోకి మారాయి. దీంతో లోహవిహంగం గాల్లోకి లేచింది
* 01:38:42 గంటలు: విమానం గరిష్ఠ వేగమైన 180 నాట్స్‌ను అందుకుంది. ఆ మరుక్షణమే ఇంజిన్ 1, ఇంజిన్ 2కు చెందిన ఇంధన స్విచ్‌లు ‘రన్’ నుంచి ‘కటాఫ్’ పొజిషన్‌కు మారాయి. ఒక సెకను తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి
* 01:38:47 గంటలు: మొదటి ఇంజిన్ ఇంధన స్విచ్ ‘కటాఫ్’ నుంచి మళ్లీ ‘రన్’కు మారింది
* 01:38:56 గంటలు: రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ కూడా ‘కటాఫ్’ నుంచి మళ్లీ ‘రన్’కు మారింది
* 01:39:05 గంటలు: పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ ‘మేడే మేడే మేడే’ అనే సందేశాన్ని పంపించారు
* 01:39:11 గంటలు: డేటా రికార్డింగ్ ఆగిపోయింది
* 01:44:44 గంటలు: క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాయి
