Air India: పాకిస్తాన్ తన గగనతలం మూసివేయడం వల్ల ఇతర పోటీ విమాన సంస్థల కన్నా ఎయిర్ ఇండియా ఎక్కువ ప్రభావితమవుతోంది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ బ్యాన్ వల్ల సంస్థపై నేరుగా ప్రభావం పడుతుందని, అయితే తమ పోటీదారులపై ఈ సమస్య ప్రభావం చూపడం లేదని ఎయిర్ ఇండియా సీఈఓ టెవోల్డే అన్నారు. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అన్ని విమానయాన సంస్థలపై ఏదో విధంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలిపారు.
పాకిస్తాన్‌లోని గగనతల ఆంక్షలు ఎయిర్ ఇండియాను తన నెట్‌వర్క్‌లో మార్పులు చేసేలా చేస్తున్నాయని అన్నారు. ఇదే కాకుండా గతేడాదితో పోలిస్తే ఇంధన ధరలు ఈ ఏడాది ధరలు రెట్టింపు కావడం కూడా ఎయిర్ ఇండియాకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే, ప్రస్తుత ఇబ్బందులు దీర్ఘకాలిక సమస్యలుగా కాకుండా తక్కువ కాలమే కొనసాగుతాయని టెవోల్డే తెలిపారు. వీటిని సమర్థంగా ఎదుర్కొంటే భవిష్యత్తులో మరింత బలంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
2025లో జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భారత్‌కు చెందిన విమానయాన సంస్థలపై గగనతల ఆంక్షలు విధించింది. భారత్‌కు చెందిన విమానయాన సంస్థలకు చెందిన విమానాలు పాక్ గగనతలంపై నుంచి వెళ్లకుండా బ్యాన్ విధించింది. ఇది గతేడాదిగా కొనసాగుతోంది. భారత్ కూడా పాకిస్తాన్‌పై ఇలాంటి ఆంక్షలే పెట్టింది. అయినప్పటికీ, పాక్‌తో పోలిస్తే భారత్‌పై ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది.

