Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..

  • సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..
  • అక్టోబర్ 24 వరకు జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు తాత్కాలిక నిలిపివేత..
Air India

Air India

Air India: సౌదీ అరేబియా-హౌతీ తిరుగుబాటుదారుల ఘర్షణ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు అక్టోబర్ 24 వరకు అన్ని విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి. విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్ తేదీ మార్చుకోవడం లేదా పూర్తి రీఫండ్ పొందే అవకాశాన్ని కల్పించాయి.

అక్టోబర్ 15 లేదా అంతకన్నా ముందు కన్ఫర్మ్ అయిన బుకింగ్‌లు చేసుకుంది, అక్టోబర్ 9-24 మధ్య ప్రయాణించాల్సిన ప్రయాణికులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. అర్హులైన ప్రయాణికులకు నవంబర్ 10 వరకు ఒక్కసారి ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసుకున్న వారికి పూర్తి రీఫండ్ అందించనున్నారు.

ఇదే సమయంలో ఎయిర్ ఇండియా ప్రయాణాకిులు దుబాయ్ లేదా దోహా నుంచి రాకపోకలకు అనుగుణంగా బుకింగ్స్ మార్చుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు అబుదాబి, అల్ ఐన్, బహ్రెయిన్, దోహా, దుబాయ్, కువైట్, మస్కట్, రాస్ అల్ ఖైమా, సలాలా, షార్జా వంటి ప్రయత్నామ్నాయం గమ్యస్థానాల నుంచి ప్రయాణించేలా బుకింగ్స్ మార్చుకోవచ్చు.