Site icon NTV Telugu

Boeing Jets: ‘‘ఇంధన నియంత్రన స్విచ్‌లో లోపాలు లేవు’’.. ఎయిర్ ఇండియా ప్రకటన..

Air India Crash

Air India Crash

Boeing Jets: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ వైమానిక చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటనగా నిలిచింది. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. విమాన ఇంజన్లకు ఇంధనాన్ని అందించే ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’లు ఆఫ్ అయిపోయినట్లుగా ఇన్వెస్టిగేటర్లు తేల్చారు. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై విచారణ జరుగుతోంది.

Read Also: MiG-21: ‘‘ఎగిరే శవపేటిక’’గా పేరు.. పలు యుద్ధాల్లో కీలక పాత్ర.. మిగ్-21 ఫైటర్ రిటైర్..

ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన బోయింగ్ సంస్థ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్‌లను తనిఖీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జూలై 14న అన్ని ఎయిర్‌లైన్ సంస్థల్ని ఆదేశించింది. ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787, బోయింగ్ 737 విమానాల్లోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లను చెక్ చేసింది. ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లలో ఎలాంటి సమస్యలు కనుగొనబడలేదు’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది.

‘‘తనిఖీలలో, లాకింగ్ మెకానిజంతో ఎటువంటి సమస్యలు కనుగొనబడలేదు. ఎయిర్ ఇండియా జూలై 12న స్వచ్ఛంద తనిఖీలను ప్రారంభించింది మరియు DGCA నిర్దేశించిన నిర్ణీత సమయ పరిమితిలోపు వాటిని పూర్తి చేసింది. అదే విషయాన్ని నియంత్రణ సంస్థకు తెలియజేయబడింది’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది.

Exit mobile version