Site icon NTV Telugu

Air India: ఒకే రోజు 7 విమానాలు రద్దు.. ఇందులో 6 బోయింగ్ డ్రీమ్‌లైనర్స్..

Airindia

Airindia

Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటన తర్వాత, ఈ రోజు ఏకంగా 07 విమానాలను రద్దు చేశారు. రద్దు చేసిన విమానాల్లో 06 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ విమానాలు ఉన్నాయి. ఇటీవల, అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైంది ఈ రకం విమానమే. ముందుగా, సాంకేతిక లోపాల కారణంగా అహ్మదాబాద్ -లండన్, ఢిల్లీ-పారిస్ విమానాలను మంగళవారం రద్దు చేశారు. దీని తర్వాత, లండన్-అమృత్‌సర్, బెంగళూర్-లండన్ విమానాలు కూడా రద్దయ్యాయి.

రద్దు చేయబడిన విమానాలు ఇవే:

AI915 – ఢిల్లీ నుండి దుబాయ్ – B788 డ్రీమ్‌లైనర్
AI153 – ఢిల్లీ నుండి వియన్నా – B788 డ్రీమ్‌లైనర్
AI143 – ఢిల్లీ నుండి పారిస్ – B788 డ్రీమ్‌లైనర్
AI159 – అహ్మదాబాద్ నుండి లండన్ – B788 డ్రీమ్‌లైనర్
AI170 – లండన్ నుండి అమృత్‌సర్ – B788 డ్రీమ్‌లైనర్
AI133 – బెంగళూరు నుండి లండన్ – B788 డ్రీమ్‌లైనర్
AI179 – ముంబై నుండి శాన్ ఫ్రాన్సిస్కో – B777 డ్రీమ్‌లైనర్

“మా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము మరియు వీలైనంత త్వరగా వారిని వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. మేము హోటల్ వసతిని అందిస్తున్నాము. ప్రయాణీకులు రద్దు చేసుకుంటే ఉచిత రీషెడ్యూలింగ్‌పై పూర్తి వాపసులను కూడా అందిస్తున్నాము” అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

గత వారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 242 మందిలో ఒకరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. విమానం డాక్టర్స్ హాస్టల్‌పై కుప్పకూలడంతో నేలపై చుట్టుపక్కల ఉన్న 33 మంది వరకు మరణించారు.

Exit mobile version