మధ్యప్రదేశ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శివపురి సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. రెండు సీట్లు కలిగిన ఈ విమానం శిక్షణలో ఉండగా ప్రమాదవశాత్తు పచ్చని పొలాల్లో కూలిపోయింది. చాకచక్యంగా ఇద్దరు పైలట్లు తప్పించుకున్నారు. గాయపడ్డ పైలట్లను ఆస్పత్రికి తరలించారు. విమానం మాత్రం కాలి బూడిదైంది. అయితే సమీపంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి.. మొబైల్‌లో షూట్ చేశారు. అనంతరం సోషల్ మీడియలో పోస్టు చేయగా… వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Konda Surekha : ఖర్గే, రాహులకు మంత్రి కొండా సురేఖ లేఖ
ఇదిలా ఉంటే ఈ విమాన ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు. మిరాజ్ 2000ని ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నిర్మించింది. 1978లో తొలిసారిగా ఎగిరింది. 1984లో ఫ్రెంచ్ వైమానిక దళం దీనిని ప్రవేశపెట్టింది. 600 మిరాజ్ 2000లను ఉత్పత్తి చేశారు. వీటిలో 50 శాతం భారతదేశంతో సహా ఎనిమిది దేశాలకు ఎగుమతి చేసినట్లుత డస్సాల్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Maruti Suzuki: మారుతి సుజుకి కార్లను కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీ డిస్కౌంట్..!