NTV Telugu Site icon

Air Force chief: ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాగా F-35 జెట్‌లను కొనలేము..

Air Force Chief

Air Force Chief

Air Force chief: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్‌కి F-35 స్టీల్త్ ఫైటర్ జెట్లను విక్రయించాలని ఇటీవల ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత, అమెరికా ఇంకా ఈ విమానం కోసం అధికారికంగా ఆఫర్ చేయలేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్(ఐఏఎఫ్) ఏపీ సింగ్ అన్నారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాక్యలు చేశారు. భారతదేశం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అసవరం ఉందని చెప్పారు. 5వ జనరేషన్ ఫైటర్ జెట్‌ల కార్యక్రమాన్ని భారత్ వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ.. భారత వైమానిక దళం ఎఫ్-35లను ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉందని, దాదాపు 80 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే జెట్, మార్కెట్‌లోనే అత్యంత ఖరీదైన ఎంపికలో ఒకటి, దాని పనితీరును కూడా యూఎస్ నివేదిక గుర్తించింది. ‘‘మనం దానిని జాగ్రత్తగా విశ్లేషించాలి. అవసరాలు ఏమిటి, దానితో పాటు ఏం వస్తాయి. ఖర్చు కూడా దానిలో ఒక భాగం, ఇది కేవలం బయట చూడటం ద్వారా కొనుగోలు చేసే ఫ్రిజ్, వాషింగ్ మెషిల్ లాంటిది కాదు. మేము దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ఇప్పటివరకు ఆఫర్ రాలేదు’’ అని ఏపీ సింగ్ అన్నారు.

Read Also: Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్.. షారూఖ్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు..

ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా పర్యటనలో ట్రంప్ భారత్‌కి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను ఆఫర్ చేశారు. భారత్ తన రక్షణ పరికరాల కోసం రష్యాపై ఆధారపడకుండా, అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీనిని చూస్తున్నారు. ఇదిలా ఉంటే, చైనా 6వ తరం యుద్ధవిమానాలను ప్రదర్శిస్తున్న తరుణంలో భారత తక్షణ అవసరాలను తీర్చడానికి భారత్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాల్సి రావచ్చని ఎయిర్ మార్షల్ చెప్పారు. ప్రస్తుతం భారతదేశ ఐదవ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ – అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) – ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. మొదటి జెట్‌లు 2035 లో మాత్రమే చేర్చబడతాయని భావిస్తున్నారు.

భారత్ వద్ద ప్రస్తుతం 30 ఫైటర్ స్వ్కాడ్రన్ల ఉన్నాయి. అయితే, వీటి సంఖ్య 42. ఒక ఫైటర్ స్వ్కాడ్రన్,2లో 18 జట్లు ఉంటాయి. చైనా ఆరవ తరం విమానాలను పరీక్షిస్తుండటంతో పాటు, పాకిస్తాన్‌‌‌కి ఎఫ్-16 నిర్వహణ కోసం అమెరికా నిధులు ఇవ్వడం గురించి ఆందోళన నెలకున్న తరుణంలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఎయిర్ చీఫ్ నొక్కి చెప్పారు.