NTV Telugu Site icon

Waqf Bill: దేశవ్యాప్తం ఉద్యమం చేస్తాం.. వక్ఫ్ బిల్లుపై ముస్లిం పర్సనల్ లాబోర్డ్ వార్నింగ్..

Waqf Bill

Waqf Bill

Waqf Bill: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది ముస్లింలకు ప్రయోజనకరం కాకుండా హానికరంగా ఉంటుందని పేర్కొంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసి రసూల్ ఇలియాస్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Chiranjeevi : చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టుపై నాని కామెంట్స్ వైరల్ ..

‘‘మేము నిశ్శబ్దంగా కూర్చోము. మాకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన,రాజ్యాంగ నిబంధనల్ని మేము ఉపయోగించుకుంటాము. ప్రతిపాదిత సవరణలను వెనక్కి తీసుకునే వరకు మేము శాంతియుత ఆందోళన నిర్వహిస్తాము’’ అని ఆయన అన్నారు. సంస్థకు చెందిన మరో వ్యక్తి మౌలానా ఖలీద్ రషీ ఫరంగి మహాలి మాట్లాడుతూ.. ముస్లిం సంస్థలు ఈ బిల్లుపై తమ ఆందోళనల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి తెలియజేసిందని, కానీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ప్రార్థన, ఉపవాసం, తీర్థయాత్ర వంటి ప్రాథమిక ఇస్లామిక్ ఆచారాలతో పోల్చదగిన మతపరమైన ప్రాముఖ్యతను వక్ఫ్ ఆస్తులు కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. పార్లమెంట్ సభ్యులంతా ముస్లిం సమాజం మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని, ప్రతిపాదిత సవరణల్ని తిరస్కరించాలని ముస్లిం పర్సనల్ లాబోర్డు సభ్యులు కోరారు.

ఇదిలా ఉంటే, కొందరు న్యాయనిపుణులు ఈ బిల్లులోని నిబంధనల్ని స్వాగతించారు. వారణాసిలో న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ.. ఈ బిల్లు గతంలో వక్ఫ్ బోర్డులకు ఉన్న అపరిమిత అధికారలను తగ్గించిందని, ఇది సానుకూల చర్య అని అన్నారు. బిల్లులోని కొన్ని అంశాలపై ఇంకా చర్చ అవసరమని ఆయన అన్నారు.