Site icon NTV Telugu

ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లుః ప్ర‌జ‌ల చేత‌ల‌ను బ‌ట్టే మూడోవేవ్‌…

క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది.  కేసులు, మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గుముఖం పడుతుండ‌టంతో ప్ర‌జ‌లు జీవ‌న విధానం సాధార‌ణంగా సాగుతున్న‌ది.  సెకండ్ వేవ్ కేసులు త‌గ్గిపోయినా, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని నిపుణులు చెబుతున్నారు.  క‌రోనా మూడో వేవ్ వ‌స్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా కొన్ని కీల‌క వ్యాక్య‌లు చేశారు.  

Read: అమితాబ్ మనవరాలితో అలాంటిదేం లేదంటోన్న అందగాడు!

మూడో వేవ్ ప్ర‌జ‌ల చేతుల్లోనే ఉంద‌ని, వ్యాక్సిన్ తీసుకొని, కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తే మూడోవేవ్ ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌ద‌ని అన్నారు.  ప్ర‌జ‌ల చేత‌ల‌ను బట్టే మూడో వేవ్ ప్ర‌భావం ఉంటుంద‌ని తెలిపారు.  ఇక డెల్టా ప్ల‌స్ వేరియంట్‌ల‌ను అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటున్నాయ‌ని, అపోహ‌లు ప‌క్క‌న‌పెట్టి వ్యాక్సిన్ తీసుకోవాల‌ని డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా పేర్కొన్నారు. 

Exit mobile version