NTV Telugu Site icon

కరోనా థర్డ్‌ వేవ్‌.. ఎయిమ్స్‌ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Randeep Guleria

Randeep Guleria

ఓవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండగా.. కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మరోవైపు థర్డ్‌ వేవ్‌పై అంచనాలు, హెచ్చరికాలు.. ఇలా అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, కరోనా థర్డ్‌ వేవ్‌పై స్పందించిన ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే వ‌చ్చే 6 నుంచి 8 వారాల్లోనే థ‌ర్డ్ వేవ్ రవొచ్చని హెచ్చరించారు. ఇక, ఇప్పుడు కలవరపెడుతోన్న డెల్టా ప్లస్ వేరియంట్‌ వ‌ల్లే క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తుందా? అని ప్రశ్నించగా.. ఆ వేరియంట్‌ను జాగ్రత్తగా ప‌రిశీలిస్తున్నాం. ప్రస్తుతానికి ఇండియాలో ఆ వేరియంట్ ప్రభావం ఎక్కువ‌గా లేదని స్పష్టం చేశారు.. డెల్టా ప్రభావ‌మే మ‌న ద‌గ్గర ఎక్కువ‌. అందువ‌ల్ల దానిని ట్రాక్ చేయ‌డానికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి అని గులేరియా అన్నారు. అయితే కరోనా థర్డ్‌ వేవ్‌ కోసం సిద్ధమ‌వ‌డంలో భాగంగా దేశ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవ‌స్థను పటిష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉందని స్పష్టం చేశారు. థర్డ్‌ వేవ్‌, డెల్టా ప్లస్ వేరియంట్‌ లాంటి ముప్పు పొంచి ఉన్న ఈ స‌మ‌యంలో.. మ‌నం ఏం చేయ‌గ‌ల‌మో చూడాలని.. ప్రజారోగ్య వ్యవ‌స్థను మెరుగుప‌ర‌చ‌డంపై దృష్టి సారించాలి సూచించారు గులేరియా.