AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్‌తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK Crisis: తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయినా.. కాంగ్రెస్, లెఫ్ట్ సహా ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు టీవీకే అధినేత విజయ్.. ఇక, అసెంబ్లీలో విజయ్ సర్కార్ బలనిరూపణ సమయంలో అనూహ్యంగా కొంత మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు పద్దతు ప్రకటించారు.. దీంతో, ఆ పార్టీలో విభేదాలు ఉన్నాయనేది స్పష్టమైంది.. అయితే, అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు మరింత ముదురుతోంది. గత పది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీని రెండు వర్గాలుగా చీల్చేశాయి. పార్టీ నాయకత్వంపై ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా రెండు శిబిరాలుగా విడిపోయి బహిరంగంగా తమ బలం ప్రదర్శించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) నాయకత్వంలో ఒక వర్గం కొనసాగుతుండగా, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఆధ్వర్యంలో మరో వర్గం ఏర్పడింది. ఈపీఎస్‌కు మాజీ మంత్రి కేసీ వీరమణి మద్దతు ప్రకటించడం రాజకీయ పరిణామాలకు మరింత వేడి తెచ్చింది. తమ వర్గానికే పార్టీపై పూర్తి అధికారం ఉందని ఇరు వర్గాలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని సచివాలయంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను రెండు వర్గాల నేతలు విడివిడిగా కలిశారు. తమ వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్పీకర్‌కు వివరించారు. ఈపీఎస్ వర్గం తరఫున 22 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారని పేర్కొనగా, వేలుమణి వర్గం తమకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేసింది.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఇక, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ను మాత్రమే గుర్తిస్తామని మాజీ మంత్రి కేసీ వీరమణి ప్రకటించారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎస్పీ వేలుమణి వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఈపీఎస్ వర్గం వెల్లడించింది. దీంతో అన్నాడీఎంకేలో రాజకీయ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది.. పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత సంక్షోభం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలపై కీలక ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల బలం, పార్టీ గుర్తింపు, నాయకత్వ వివాదం తదితర అంశాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!