NTV Telugu Site icon

AIADMK: ఎన్డీయే నుంచి బయటకు రావడానికి అన్నామలై కారణం.. లేకుంటే 35 సీట్లు గెలిచేవాళ్లం..

Annamalai

Annamalai

AIADMK: తమిళనాడులో సొంతంగా ఎదగాలని ప్రయత్నించిన బీజేపీ కొంతమేరకు సక్సెస్ అయింది. ఎంపీ సీట్లు గెలవకపోయినప్పటికీ, ఓట్ల శాతాన్ని డబుల్ డిజిట్‌కి పెంచుకుంది. ఈసారి ఎన్నికల్లో కనీసం మూడు ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్ష ఏఐడీఎంకే కూడా ఈ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని గెలవలేకపోయింది. ఇదిలా ఉంటే ఆ పార్టీ అన్నామలైపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్డీయే నుంచి ఏఐడీఎంకే బయలకు రావడానికి అన్నామలై కారణమని ఆరోపించింది.

Read Also: Lok Sabha Election Results 2024: ఆ 21 స్థానాల్లో గెలుపు..ఓటములకు దాదాపు 10 వేల ఓట్ల తేడా మాత్రమే..

జయలలిత వారసత్వాన్ని అన్నామలై అవమానించారని,తాము ఎన్డీయేతో విడిపోవడానికి తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కారణమని గురువారం అన్నాడీఎంకే పార్టీ నేత ఎస్పీ వేలుమణి అన్నారు. లేకపోతే రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లను గెలిచేవాళ్లమని చెప్పారు. 2019లో 19.39 శాతం ఉన్న ఓట్ల శాతాన్ని 2024లో 20.3 శాతానికి పెంచుకోవడంలో పార్టీ విజయవంతమైందని వేలుమణి అన్నారు. ‘‘ఇంతకుముందు, మేము తమిళిసై సౌందరరాజన్ మరియు తరువాత, ఎల్ మురుగన్ నాయకత్వంలో బిజెపితో పొత్తు పెట్టుకున్నాము, అయితే, అన్నామలై అధికారం చేపట్టిన తర్వాత అతను జయలలితతో పాటు పళనిస్వామిని విమర్శిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఏఐడీఎంకే, బీజేపీ కూటమిగా ఉంటే 35 సీట్లు గెలిచేవాళ్లం’’ అని ఆయన అన్నారు.

మరోవైపు కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నామలై, డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒకప్పుడు ద్రవిడ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న అన్నాడీఎంకే, జయలలిత మరణం తర్వాత మసకబారిపోతోంది. ఈ పార్టీ 39 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే ఒకే స్థానంలో విజయం సాధించింది. 39 సీట్లలో ఓడిపోయింది. 12 కీలక నియోజకవర్గాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ స్థానాల్లో ఎన్డీయే కూటమి రెండో స్థానంలో నిలిచింది.