అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తుది నివేదిక రాలేదు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు సంస్థలు ఇంకా బయటపెట్టలేదు. ఏఏఐబీ మాత్రం 15 పేజీల ప్రాథమిక రిపోర్టును బయటపెట్టింది. ఈ నివేదికలో ఇంధన స్విచ్‌లు దగ్గర సమస్య వచ్చినట్లుగా పేర్కొంది. రెండు స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొంది. అయితే ఈ స్విచ్‌లను ఫైలట్ ఉద్దేశపూర్వకంగానే ఆపేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదనలను పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తుది నివేదిక రాకుండా తప్పుడు కథనాలు ఎందుకు ప్రచారం చేస్తారంటూ మండిపడ్డాయి.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటన
అయితే ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ తుది నివేదికను ఈ ఏడాది చివరి నాటికి సమర్పించే అవకాశం ఉన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని.. ఈ సంవత్సరం చివరి నాటికి తుది నివేదికను సమర్పించే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు మీడియాతో పేర్కొన్నాయి. రెండు బ్లాక్ బాక్స్‌లపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రెండింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Viral video: రైలు కింద పడుకున్నా ఏం కాలేదంటే… నువ్వు నిజంగా దేవుడివి స్వామి..
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.
