NTV Telugu Site icon

Ram Mandir: రామ మందిర వేడుక వేళ.. 100కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన కేంద్రం..

Social Media

Social Media

Ram Mandir: రామ మందిర వేడుకకు యావత్ దేశం సిద్ధమైంది. రేపు జరిగే కార్యక్రమం కోసం ప్రజలంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి యూపీ సర్కార్‌తో పాటు కేంద్ర భద్రత ఏజెన్సీలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే కొన్ని ఉగ్రవాద సంస్థల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో భద్రతా ఎజెన్సీలు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్, ఏఐ కెమెరాలతో భద్రతను పటిష్టం చేశారు.

Read Also: Ram Mandir Holiday: రామ మందిర వేడుక రోజు ఏ రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి..? ఏ సంస్థలకు హాలిడే..?

ఇదిలా ఉంటే రామ మందిర వేడుక వేళ విష ప్రచారం చేసేందుకు పాకిస్తాన్‌కి చెందిన సోషల్ మీడియా అకౌంట్లు ప్లాన్ చేస్తున్నాయని కేంద్రహోం శాఖ ఇటీవల పేర్కొంది. మత సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను లేదా అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులను కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలోనే 100 సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం బ్లాక్ చేసింది.

హోం మంత్రిత్వ శాఖ (MHA), సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, CERT-IN, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) యొక్క ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులతో కూడిన సైబర్ నిపుణుల బృందాన్ని ఇప్పటికే అయోధ్యకు పంపింది. శ్రీరామ మందిరంపై ఏవైనా నకిలీ/డీప్‌ఫేక్ వీడియోలు ఉంటే వెంటనే తీసివేయాలి మరియు అలాంటి కేసులును కేంద్ర హోంమంత్రి శాఖ, నార్త్ బ్లాక్ కంట్రోల్ రూమ్‌కి నివేదించనున్నారు. తప్పుడు కంటెంట్ వ్యాప్తి చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్(ట్విట్టర్) లకు సంబంధించిన 100 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసింది.

Show comments