NTV Telugu Site icon

Karnataka: బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం.. ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు..

Bommai

Bommai

Karnataka: కర్ణాటక ఎన్నికల ముందు అక్కడి అధికార బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచింది. ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ముస్లింలు 10 శాతం ఆర్థికంగా బలహీన విభాగం(ఈడబ్ల్యూఎస్) కేటగిరిలో రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. ముస్లింల 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగా, లింగాయత్ లకు ఇవ్వనున్నారు.

Read Also: Pakistan Economic Crisis: పాకిస్తాన్ దుస్థితి.. ఎన్నికల నిర్వహణకు కూడా డబ్బుల్లేవు..

ఎన్నికలు మరో నెలలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కేటాయింపులను తీసివేసి, రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. దీనికి ముందు జరిగిన క్యాబినెట్ సమావేశంలో రిజర్వేషన్లను 50 నుంచి 56 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ 10 శాతం కేటగిరిలో బ్రహ్మణులు, వైశ్యులు, ముదలియార్లు, జైనులు వర్గాల్లాగనే రిజర్వేషన్లు పొందనున్నారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం బొమ్మై మతపరమైన మైనారిటీల కోటాను రద్దు చేసి ఎలాంటి షరతులు లేకుండా ఈడబ్ల్యూఎస్ కిందికి తీసుకువస్తామని ప్రకటించారు.

గతేడాది బెలగావి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2సీ, 2డీ అనే రెండు కొత్త రిజర్వేషన్ కేటగిరీలను సృష్టించి ముస్లింలకు ఉన్న 4 శాతాన్ని వొక్కలిగ(2శాతం), లింగాయత్(2 శాతం) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటకలో షెడ్యూల్డ్్ కులాల(ఎస్సీలు) రిజర్వేషన్ 15 నుంచి 17 శాతం, ఎస్టీల రిజర్వేషన్ 3 నుంచి 7 శాతానికి పెంచారు.