Conversion racket: పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న మతమార్పిడి ముఠాను ఆగ్రా పోలీసులు పట్టుకున్నట్లు శనివారం వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ నెట్వర్క్ సోషల్ మీడియా, లూడో స్టార్ వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారామ్స్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, డార్క్ వెబ్‌లను ఉపయోగించి పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. క్రౌడ్ ఫండింగ్, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బు లావాదేశీలు జరిగాయని అధికారులు కనుగొన్నారు. గాజాకు నిధులు నిధులను పంపడం, స్వీకరించినట్లు తేలింది. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తన్వీర్ అహ్మద్, సాహిల్ అదీబ్‌లను ఈ నెట్వర్క్ నాయకులుగా గుర్తించారు. వీరిద్దరు పాకిస్తాన్ నుంచి వాట్సాప్, ఆన్‌లైన్ గ్రూపులనను నడిపిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్రూపుల్లో మతపరమైన విషయాలను పంచుకున్నట్లు తెలిసింది.
Read Also: Hamas: టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..
హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన బాలికలు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారు మతపరమైన బోధన అందించినట్లు పరిశోధకులు తెలిపారు. కొంతమంది కాశ్మీరీ అమ్మాయిలు, ఇతరులను పాకిస్తాన్ ఆధారిత గ్రూపులతో అనుసంధానించడం ద్వారా మతమార్పిడిన ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. కీలక నిందితుల్లో ఒకరైన రెహమాన్ ఖురేషి ఈ నెట్వర్క్‌లో ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తున్నాడు. ఆగ్రా పోలీసులు, కేంద్ర సంస్థలు ఇతడిని ప్రశ్నిస్తున్నాయి.
ఈ నెట్వర్ ‘‘దవాహ్’’ పేరుతో పనిచేస్తోందని, 2050 నాటికి భారతదేశంలో ఇస్లాంను వ్యాప్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. నిందితులు ఎమోషన్‌గా ఉన్నవారిని ,కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న వారిని లక్ష్యంగా చేసుకుంది. ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా హిందూ బాలికతలో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, ఎవరికి తెలియకుండా డార్క్ వెబ్, ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకునే వారని తేలింది.
ఈ నిందితుల బృందం మతమార్పిడి చెందిన వ్యక్తులను ‘‘రివర్ట్’’ అని పేర్కొంది. ఢిల్లీకి చెందిన అబ్దుల్ రెహమాన్, గోవాకు చెందిన అయేషా ఈ గ్రూపు నాయకులుగా గుర్తించారు. 1990లో మతమార్పిడి చెందిన అబ్దుల్ రెహమాన్‌కు ప్రస్తుతం ఈ కేసులో పట్టుబడిన వారిలో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానాకు చెందిన బాలికలను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం వీరందరిని పోలీసులు రక్షించారు.
