NTV Telugu Site icon

Agnipath: త్రివిధ దళాల్లో అగ్నిపథ్ ప్రారంభం అయ్యేది ఎప్పుడంటే..?

Agnipath

Agnipath

Agnipath Notifications: కేంద్ర ప్రభుత్వం  సైన్యంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ను తీసుకువచ్చింది. ఓ వైపు ఈ పథకంపై అల్లర్లు జరుగుతున్నప్పటికీ.. సైన్యం మాత్రం ఇది సైన్యానికి, యువకు లబ్ధి చేకూర్చేలా ఉంటుందని వెల్లడించింది. తొలి బ్యాచ్ కింద 45 వేల అగ్నివీరులను సైన్యంలో చేర్చుకోనున్నారు. వచ్చే ఏడాది జూలై వరకు తొలి బ్యాచ్ అందుబాటులోకి వచ్చే విధంగా ఆరునెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

 

సైన్యం ( ఆర్మీ)లో అగ్నివీరుల నియామకం
—————————————————-
అగ్నిపథ్ స్కీమ్ కింద ఆర్మీలో అగ్నివీరుల నియామకం గురించి  లెఫ్ట్ నెంట్ జనరల్ బన్సి పొన్నప్ప వెల్లడించారు.

• జులై 1 న నోటిఫికేషన్ జారీ

• దేశంలోని అన్ని రాష్ట్రాలలో 83 ర్యాలీలను నిర్వహిస్తాం. అన్ని గ్రామాల నుంచి ఎంపిక చేస్తాం.

• ఆగస్టు మొదటి వారంలో ర్యాలీలు ప్రారంభం అవుతాయి. మొదట ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ లు . తర్వాత ఎంట్రన్స్ టెస్ట్.

• ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లలో ర్యాలీలు నిర్వహిస్తాం. రెండు బ్యాచ్ లుగా ఎంపిక చేసి శిక్షణా కేంద్రాలకు పంపుతాం.

• తొలి విడతగా సుమారు 25 వేల మందిని డిసెంబరు మొదటి వారం కల్లా ఎంపిక చేస్తాం.

• ఫిబ్రవరి 23 కల్లా రెండవ బ్యాచ్ ఎంపిక పూర్తవుతుంది.

• మొత్తం గా ఆర్మీ కోసం 40 వేల మంది ని “అగ్నిపథ్” పథకం కింద ఎంపిక చేస్తాం.

 

నావికా దళం అగ్నివీరుల నియామకం
—————-
నావికాదళంలో అగ్నివీరుల నియామకం, నోటిఫికేషన్ గురించి వైస్ అడ్మిరల్ డి.కే. త్రిపాఠీ వెల్లడించారు.

• ఎంపిక ప్రక్రియను ఇప్పటికే సిధ్దం చేశాం.

• జూన్ 25 కల్లా కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ప్రకటనలు అందజేస్తాం.

• ఒక్క నెలలోనే ఎంపిక ప్రక్రియ ప్రారంభమౌతుంది.

• నవంబర్ 21 మొదటి బ్యాచ్ “అగ్నివీరుల”ను ఒరిస్సా శిక్షణా కేంద్రానికి పంపడం జరుగుతుంది.

• మహిళా “అగ్నివీరులను’’ కూడా ఎంపిక చేస్తాం.

 

వాయు సేన అగ్నివీరుల నియామకం
—————
వాయుసేనలో అగ్నివీరుల నియామకం గురించి ఎయుర్ మార్షల్ సూరజ్ ఝా వెల్లడించారు.

• మొదటి “అగ్నివీరుల’’కు జూన్ 24 న, నోటిఫికేషన్, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్.

• సరిగ్గా నెల తర్వాత, జులై 24 నుంచి మొదటి విడత బ్యాచ్ ఆన్‌లైన్‌ పరీక్ష ప్రారంభం.

• ఈ ఏడాది చివరికల్లా మొదటి బ్యాచ్ ఎంపిక.

• డిసెంబర్ 30 న తొలి బ్యాచ్ కు శిక్షణ ప్రారంభం.