NTV Telugu Site icon

తూర్పు ల‌ద్ధాఖ్ బోర్డ‌ర్‌లో చైనా వైమానిక విన్యాసాలు…అప్ర‌మ‌త్త‌మైన భార‌త్‌…

గ‌త ఏడాది కాలంగా  తూర్పు ల‌ద్ధాఖ్ ప్రాంతంపై చైనా క‌న్నేసింది.  చైనా బోర్డర్లో భారీగా సైనికుల‌ను మోహ‌రిస్తూ రావ‌డంతో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి.  అదే స‌మ‌యంలో ఇరు దేశాల‌కు చెందిన సైనికుల మ‌ద్య బాహాబాహీలు జ‌రిగాయి.  ఈ దాడుల్లో ఇరు దేశాల‌కు చెందిన సైనికులు మృతి చెందారు.  తూర్పు ల‌ద్ధాఖ్ స‌రిహ‌ద్దుల నుంచి సైనికుల‌ను వెన‌క్కి తీసుకుంటూనే చైనా త‌న బోర్డ‌ర్‌ను ఆధునీక‌రిస్తు వ‌చ్చింది.  యుద్ధ విమానాలు, ఆయుధ సామాగ్రిని భ‌ద్ర‌ప‌రిచేందుకు కాంక్ర‌ట్ నిర్మాణాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డ‌మే కాకుండా యుద్ధ‌విమానాల‌తో విన్యాసాలు చేసింది.  20కి పైగా జె11, జె 16 యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయి.  క‌ష్గ‌ర్‌, హోటాన్, ఎంగారి గున్సా, షిగాట్సే, లాసా, నియంగిచి త‌దిత‌ర ప్రాంతాల నుంచి ఈ యుద్ద విన్యాసాలు సాగాయి.  దీంతో ఇండియా అప్ర‌మ‌త్తం అయింది. డ్రాగ‌న్ విన్యాసాల‌ను గ‌మ‌నిస్తున్నామ‌ని భార‌త సైన్యం తెలిపింది.  ఇక భార‌త వైమానిక ద‌ళం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైన్యం ఆదేశించింది.