NTV Telugu Site icon

దారుణం: గోవా ఆస్పత్రిలో మరో 8 మంది మృతి…

గోవాలో కరోనా మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రి లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.  ఈ మెడికల్ కాలేజీలో కొన్ని రోజులుగా ఆక్సిజన్ కొరత కారణంగా తాజాగా 8 మంది మృతి చెందారు.  దీంతో ఇప్పటి వరకు గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మొత్తం 83 మంది మృతి చెందారు.  వారం రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడంతో అధికారులు ఈ  ఆసుపత్రిపై దృష్టి సారించారు.  ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  శనివారం అర్థరాత్రి సమయంలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడం వలన మరణాలు సంభవించాయని మృతుల బంధువులు చెప్తుంటే, న్యూమోనియా వలన రోగులు మృతి చెందారని వైద్యులు చెప్తున్నారు.