Site icon NTV Telugu

Air India: ఓ వైపు అంతులేని విషాదం.. ఇంకోవైపు ఎయిరిండియా ఉద్యోగులు బ్రేక్‌ డ్యాన్స్‌లు.. వీడియో వైరల్

Airindia

Airindia

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు.. దేశ ప్రజలు మరిచిపోలేదు. ఇంకా కళ్ల ముందు ఆ దృశ్యాలే మెదులుతున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. సెకన్లలో సమీపంలోని ఒక హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో ఉన్న 35 మంది మెడికోలు కూడా దుర్మరణం చెందారు. ఇంత మంది ఒకేసారి చనిపోవడంతో దేశ ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత ఘోర విషాదం నెలకొంటే.. కనీసం మానవత్వం లేకుండా ఎయిరిండియా ఉద్యోగులు సభ్యత మరిచి ప్రవర్తించారు. డీజే పాటలకు మహిళా ఉద్యోగులతో పాటు పురుష ఉద్యోగులు నృత్యాలు చేస్తూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Rashmika: ధనుష్‌పై ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టిన నేషనల్ క్రష్..

విమానాశ్రయంలో గ్రౌండ్ సేవలు అందించే టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా ఉద్యోగులు జూన్ 20న హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ జీఎం హాజరయ్యారు. కార్యనిర్వాహకులు డీజే పార్టీ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ పాటలు ప్లే అవుతుండగా ఉద్యోగులంతా బ్రేక్ డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేశారు. మహిళా ఉద్యోగులు కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. మగ ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Phone Tapping : సిట్‌ ముందుకు ఈటల రాజేందర్

ఎయిరిండియా ఉద్యోగుల తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు బాధలో ఉంటే.. ఆప్తులను కోల్పోయి రోదిస్తుంటే కనీసం మానవత్వం లేకుండా గంతులేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్తు దేశం దు:ఖంలో ఉంటే ఇంగిత జ్ఞానం లేకుండా ఇవేమీ డ్యాన్స్‌లు అంటూ నెటిజన్లంతా ఫైరవుతున్నారు.

 

Exit mobile version