ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రతి ఒక్కరికి వారి జీవితంపై ఎన్నో కలలు ఉంటాయి. ఆ కలను నెరవేర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే, కరోనా మహమ్మారి ఆ కలలపై నీళ్లు చల్లింది. కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలు పోయి కోట్లాదిమందిని రోడ్డున పడేసింది ఈ మహమ్మారి. కొంతమంది జీవితంలో ఏదేతే సాధించాలని అనుకున్నారో, అది సాధించి ఆ ఫలాలు చేతికి అందే సమయానికి కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. బీహార్‌కు చెందిన అవినాశ్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో జాబ్ సాధించాలనే కల ఉన్నది.
Read: ‘గమ్మత్తు’ చేస్తానంటున్న పార్వతీశం, స్వాతి దీక్షిత్
దానికోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఇంజనీర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి కోచింగ్ తీసుకొని పరీక్షలు రాశాడు. పరీక్షలు రాసిన తరువాత అవినాశ్ కరోనా బారిన పడ్డాడు. కొన్నిరోజులు ట్రీట్‌మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, తిరిగి ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ జూన్ 24 వ తేదీన మరణించాడు. అయితే, జూన్ 30 వ తేదీన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రిజల్ట్ వచ్చాయి. అవినాశ్‌కు జాబ్ వచ్చినట్టుగా సర్వీస్ కమీషన్ తెలిపింది. అయితే, ఆ జాబ్ లో చేరడానికి, కల నిజమయిందని సంతోషించడానికి అవినాశ్ లేడు.
