Site icon NTV Telugu

USA: ‘‘పాకిస్తాన్‌లో ఉన్న వారు జాగ్రత్త’’.. అమెరికా ట్రావెట్ అడ్వైజరీ..

Usa

Usa

USA: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలపై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో దాడులు చేసింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుతో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కి చెందిన 100 మందికి మించి ఉగ్రవాదులు హతమయ్యారు.

Read Also: Pakistan Minister: అందరిముందు పాకిస్తాన్ మంత్రి పరువు తీసిన మహిళ యాంకర్.. వీడియో వైరల్

ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌లో అమెరికా పౌరులకు యూఎస్ రాయబార కార్యాలయం కీలక హెచ్చరికలు జారీ చేసింది. సంఘర్షణ ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ లోని తమ పౌరులకు యూఎస్ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

భారత్-పాకిస్తాన్ సరిహద్దు, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఉగ్రవాదం, సాయుధ ఘర్షణకు అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అక్కడికి వెళ్లొద్దని సలహా ఇచ్చింది. యూఎస్ పౌరులు అక్కడికి వెళ్లాలను కుంటే మరోసారి పరిశీలించుకోవాలని అని సూచించింది. ఇదే విధంగా, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులకు కూడా వెళ్లొద్దని చెప్పింది.

Exit mobile version