After Atiq Ahmed Murder, Centre Prepares Advisory For Journalists: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పోలీస్ కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్ అతని సోదరులు అఫ్రాప్ అహ్మద్ లను పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చిచంపారు ముగ్గురు నిందితులు. అతిక్, అఫ్రాఫ్ లను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువస్తున్న సమయంలో జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు నిందితులు దగ్గర నుంచి కాల్చి చంపారు.
Read Also: Atiq Ahmed: 17 ఏళ్లకే మర్డర్.. 27 ఏళ్లకు ఎమ్మెల్యే.. 44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ..
ఈ నేపథ్యంలో జర్నలిస్టుల భద్రత కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ)ని తయారు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.
పోలీసుల రక్షణగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో జర్నలిస్టులుగా వచ్చిన ముగ్గరు పిస్టళ్లు తీసి కాల్పులు జరిపారు. కొద్ది సేపటికే వీరిని పోలీసులు పట్టుకున్నారు. పెద్ద గ్యాంగ్ స్టర్లుగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ముగ్గురు ఇలాంటి నేరానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఉన్నాడు. ఇతడు పోలీస్ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.
