Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News After 40 Years Of Love Marriage

40 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ప్రేమ జంట‌కు పెళ్లి.. ఎందుకో తెలుసా..?

Published Date :January 20, 2022 , 5:35 pm
By Sudhakar Ravula
40 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ప్రేమ జంట‌కు పెళ్లి.. ఎందుకో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొంద‌రి జీవితాల్లో కొన్ని తీర‌ని కోరిక‌లు ఉంటాయి.. అవి కొన్నిసంద‌ర్భాల్లో తీర్చుకునే అవ‌కాశం వ‌చ్చినా.. వెనుక‌డుగు వేసేవారు కూడా ఉంటారు.. అయితే, కొంద‌రి ఒత్తిడియే.. లేక ప్రేమ‌నో.. వారి ఆశ‌ల‌ను నెర‌వేరిస్తే ఆ ఆనంద‌మే వేరుగా ఉంటుంది.. ఓ వృద్ధ దంప‌తుల కోరిక కూడా అలా తీరింది.. 40 ఏళ్ల క్రితం వారు ఒక్క‌టైనా.. కూతురు పుట్టినా.. ఆమెకు పెళ్లి చేసిన త‌ర్వాత‌.. అంటే దాదాపు 60 ఏళ్ల వ‌య‌స్సులో వారికి పెళ్లి చేసుకుని వార్త‌ల్లో నిలిచారు. రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ వృద్ధ జంట పెళ్లికి సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

వడ్లిపడా ప్రాంతానికి చెందిన బాబు, తలైపడా ప్రాంతానికి చెందిన కంటా.. 40 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు.. త‌మ ప్రేమ విష‌యాన్ని ఇంట్లో చెప్పి.. వారిని ఒప్పించి పెళ్లితో ఒక్క‌టి కావాల‌నుకున్నారు. కానీ, వారి ప్రేమ‌కు కులం అడ్డుగోడ‌గా నిలిచింది.. పెద్ద‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో.. వారిని ఎదురించి ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత సీమా‌ అనే అమ్మాయి పుట్టింది.. ఆమెను పెంచి పెద్ద‌చేసి.. ఓ యువ‌కుడికి ఇచ్చి పెళ్లి చేశారు.. అయితే.. పెళ్లి చేసుకుని 40 ఏళ్లు గ‌డిచినా త‌మ పెళ్లి సంప్రదాయబద్దంగా జరగలేదని బాధ మాత్రం బాబు, కంటా మ‌దిని ఎప్పుడూ తొల‌చివేసేది.. వాళ్ల బాధను గుర్తించిన‌ కూతురు, అల్లుడు.. లేటు వ‌య‌సు అయినా వారిద్దరికీ సంప్రదాయబద్దంగా పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.. దాదాపు వంద మంది అతిథుల సమక్షంలో ఈ వృద్ధ దంపతుల‌కు సంప్రదాయబద్దంగా వివాహం చేశారు.. 40 ఏళ్ల క్రితం వారి పెళ్లి జ‌రిగినా.. మరోసారి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా వివాహం చేసుకున్నారు. విశేషం ఏంటంటే.. గ‌తంలో వారి ప్రేమ‌ను, పెళ్లిని అంగీక‌రించ‌ని వారి కుటుంబ స‌భ్యులు కూడా హాజ‌రై.. వారిని ఆశీర్వ‌దించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Banswara
  • Marriage
  • Old couple
  • Rajasthan
  • wedding

తాజావార్తలు

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

  • Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions