Advanced Features In New Vande Bharat Trains: భారతీయ రైల్వేలు మరింత ఆధునాతనంగా తయారు అవుతున్నాయి. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతున్న వందే భారత్ 2 ట్రైన్లలో మరిన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది. భారత దేశంలో వేగంగా ప్రయాణించే రైళ్లుగా వందే భారత్ రైళ్లకు పేరుంది. ఇప్పుడు ఆ స్పీడును మరింత తక్కువ సమయంలో అందుకునేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వందే భారత్ 2 ప్రయాణికులకు అత్యుత్తమమైన, అప్‌గ్రేడ్ చేసిన సౌకర్యాలను అందిస్తుంది. ఆగస్టు 2023 నాటికి 75 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Errabelli Dayakar Rao: అసోం సీఎంపై ఫైర్.. ఆయన వల్లే హైదరాబాద్‌లో ఉద్రిక్తత
వందే భారత్ 2 కేవలం 52 సెకన్లలో 0 నుంచి గంటలకు 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. కొత్త వందేభారత్ 2 ట్రైన్లు 130 సెకన్లలో 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నాయి. గతంలో ఇది 146 సెకన్లుగా ఉండేది. బరువు 430 టన్నుల నుంచి 392 టన్నులకు తగ్గించనున్నారు. దీంతో పాటు డిమాండ్ పై వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నారు. కొత్త వందేభారత్ ట్రైన్లలో 24 అంగుళాల ఎల్‌సీడీ టీవీకి బదులు 32 అంగుళాల ఎల్‌సీడీ టీవీని తీసుకురానున్నారు. 15 శాతం ఎక్కవ ఎనర్జీ ఎఫెక్టివ్ ఏసీలతో పాటు డస్ట్ ఫ్రీ క్లీన్ ఎయిర్ కూలింగ్ ట్రాక్షన్ మోటర్ వంటి ఫీచర్లను వందే భారత్ 2 ట్రైన్లలో తీసుకురానున్నారు.
ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు అందిస్తున్న సైడ్ రిక్లైనర్ సీటు సౌకర్యాన్ని.. కొత్త వందే భారత్ ట్రైన్లలో అన్ని తరగతుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వందే భారత్ ట్రైన్ కొత్త డిజైన్లలో ఎయిర్ ప్యూరిఫైయర్ కోసం రూఫ్ మౌంటైడ్ ప్యాకేజీ యూనిట్(ఆర్ఎంపీయూ)లో అల్ట్రా వైలెట్ ఎయిర్ ప్యూరిఫికేషణ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ) సిఫార్సుల ప్రకారం.. రైల్ లో స్వచ్ఛమైన గాలితో పాటు బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను ఫిల్టర్ చేసే విధంగా ఆర్ఎంపీయూ సిస్టమ్ రాబోతోంది.
