NTV Telugu Site icon

India Richest MLAs: ధనిక, పేద ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఎక్కువగా ఉన్నారంటే..!

Indiarichestmlas

Indiarichestmlas

దేశంలో ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ నివేదిక వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ధనవంతుడైన బీజేపీ ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్లు ఉన్నాయని.. అత్యంత పేద బీజేపీ ఎమ్మెల్యే ఆస్తులు కేవలం రూ.1,700లే అని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే ముందు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ విశ్లేషణ చేసి నివేదిక విడుదల చేసింది.

ముంబైలోని ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి పరాగ్ షా దాదాపు రూ.3,400 కోట్ల ఆస్తులతో భారతదేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక తెలిపింది . ఆయన తర్వాత కర్ణాటకలోని కనకపుర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ రూ.1,413 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా అత్యంత పేద ఎమ్మెల్యేగా ఉన్నట్లు పేర్కొంది. ఆయన ప్రకటించిన ఆస్తులు కేవలం రూ. 1,700 మాత్రమేనని తెలిపింది. 28 రాష్ట్ర అసెంబ్లీలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4,092 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు పరిశీలించింది.

అత్యంత ధనిక ఎమ్మెల్యేలు వీళ్లే..
చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి: రూ. 931 కోట్లు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్: రూ. 757 కోట్లు
కేహెచ్ పుట్టస్వామి గౌడ, కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యే: రూ.1,267 కోట్లు
ప్రియాకృష్ణ, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే: రూ.1,156 కోట్లు
పి. నారాయణ, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే: రూ. 824 కోట్లు
వి ప్రశాంతి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే: రూ. 716 కోట్లు

టాప్ 10 అత్యంత సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టాప్ 20 అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణతో సహా ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు.