NTV Telugu Site icon

Aditya-L1 Mission: ఆదిత్య ఎల్ 1 మిషన్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన ఇస్రో.. సెప్టెంబర్ 2న ప్రయోగం..

Aditya L1 Mission

Aditya L1 Mission

Aditya-L1 Mission: చంద్రయాన్-3తో చంద్రుడిని అందుకున్న భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ఇప్పుడు సూర్యుడిపై అధ్యయనానికి సిద్ధమైంది. ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి చేపడుతున్న ‘ఆదిత్య ఎల్ 1 మిషన్’ షెడ్యూల్ ఖరారైంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ ‘పీఎస్ఎల్వీ-సీ57’ ద్వారా ఆదిత్య ఎల్1 మిషన్ చేపట్టనుంది ఇస్రో.

Read Also: Rahul Gandhi: “టికెట్ టూ డిజాస్టర్”.. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీ కార్టూన్..

ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న చేపట్టబోతున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. శ్రీహరికోట లోని షార్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 2 ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్1ను పీఎస్ఎల్వీ-సీ 57 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతోంది. ఇస్రో చేపడుతున్న మొదటి అంతరిక్ష ఆధారిత భారత అబ్జర్వేటరీ ప్రయోగం.