NTV Telugu Site icon

Aditya L1 Solar Mission: ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతం .. నాలుగు నెలల ప్రయాణం..

Aditya L1 Solar Mission

Aditya L1 Solar Mission

Aditya L1 Solar Mission: ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆదిత్య ఎల్1
ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో గెలుపు గుర్రం పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఆదిత్య ఎల్1 దూసుకెళ్లింది. శనివారం 11.50 గంటలకు శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల అనంతరం పీఎస్ఎల్వీ రాకెట్ భూమి దిగువ కక్ష్యలో ఆదిత్య ఎల్1ని ప్రవేశపెట్టింది.

ఇక్కడ నుంచి దాదాపుగా 15 లక్షల దూరంలో ఉన్న లాంగ్రెస్ పాయింట్ 1(L1) వద్దకు చేరుకుని అక్కడి హాలో కక్ష్యలో ఆదిత్య ఎల్1 శాటిలైట్ చేరనుంది. ఇక్కడ నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. ఐదేళ్ల పాటు ఈ పరిశోధనలను కొనసాగించనుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ డేటాను అందించనుంది. రోజుకు 1400 ఫోటోలను భూమికి పంపనుంది.

Read Also: Singareni: సింగరేణి కార్మికులకు సర్కార్‌ శుభవార్త.. ఒక్కో కార్మికుడికి రూ. 4 లక్షలు..!

ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ మొత్తం బడ్జెట్ రూ. 378 కోట్లు. శాటిలైట్ బరువు 1500 కేజీలు. ఇస్రో తొలిసారి సూర్యుడిపై పరిశోధన కోసం ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. సూర్యుడి కరోనా, సౌర తుఫానులు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి అంశాలపై ఆదిత్య ఎల్1 పరిశోధనలు చేయనుంది. ఆదిత్య ఎల్1 మొత్తం 7 పేలోడ్లను కలిగి ఉంటుంది. ఇవి సూర్యుడి ప్లాన్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని అధ్యయనం చేస్తాయి. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ ఇందులో అతిపెద్ద పేలోడ్, అత్యంత కీలకమైనది.

అంతరిక్షలంలో భూమి, సూర్యుడి మధ్య గురుత్వాకర్షణ శక్తులు సమానంగా ఉండే పాయింట్లను లాంగ్రేజ్ పాయింట్లుగా పిలుస్తారు. ఇవి మొత్తం 4 ఉంటాయి. ప్రస్తుతం L1 పాయింట్ వద్ద ఆదిత్య ఎల్ 1 కక్ష్యలోకి చేరనుంది.