NTV Telugu Site icon

Kamal Haasan: దక్షిణాదిని హిందీ రాష్ట్రాలుగా మార్చి బీజేపీ గెలవాలనుకుంటోంది

Kamalhaasan

Kamalhaasan

కేంద్రంపై నటుడు కమల్‌హాసన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చి.. బీజేపీ గెలవాలనుకుంటోందని కమల్ హాసన్ ఆరోపించారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలను బలవంతంగా హిందీ భాషగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.

డీలిమిటేషన్‌పై స్టాలిన్.. బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కమల్‌హాసన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై కమల్ హాసన్ మండిపడ్డారు. బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై హిందీ రుద్దుతున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Singer Kalpana: జరిగింది ఇదే.. సింగర్ కల్పన కేసులో పోలీసుల వివరణ..

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్టాలిన్‌ మాట్లాడుతూ. 1971 జనాభాల లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని కేంద్రాన్ని స్టాలిన్‌ అభ్యర్థించారు. ప్రస్తుత జనాభా ప్రకారం.. పార్లమెంటులో తాము 12 సీట్లు కోల్పోయి.. 10 సీట్లు మాత్రమే వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది తమిళ రాజకీయాలపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనన్నారు. ఈ చర్య రాష్ట్ర గొంతును నొక్కేస్తుందన్నారు. తాము విభజనకు వ్యతిరేకం కాదని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2026 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ చేపట్టరాదని అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు.

వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార-ప్రతిపక్షాలు సన్నద్ధం అవుతున్నాయి. అలాగే నటుడు, టీవీకే అధినేత విజయ్ కూడా ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు. సింగిల్‌గానే బరిలోకి దిగాలని చూస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Ajith : అజిత్ తో తలపడేందుకు ధనుష్ భయపడ్డాడా..?