Site icon NTV Telugu

Jacqueline Fernandez: నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పొడగింపు..

Jacqueline

Jacqueline

Actor Jacqueline Fernandez’s Pre-Arrest Bail Extended Till Tuesday: బాలీవుడ్ యాక్టర్ జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ ప్రి అరెస్ట్ బెయిల్‌ను మంగళవారం వరకు పొడగించింది ఢిల్లీ కోర్టు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు కూడా ప్రమేయం ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో గతంలో జాక్వెలిన్ కు ఢిల్లీ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే దీన్ని మంగళవారం వరకు పొడగించింది ఢిల్లీ కోర్టు. ప్రత్యేక న్యాయమూర్తి శైలేంద్ర మాలిక్, జాక్వెలిన్ బెయిల్ పై ఉత్తర్వులను వెలువరించనున్నారు.

జాక్వెలిన్ తరుపు న్యాయవాదులతో పాటు ఈడీ తరుపున న్యాయవాదులు కోర్టు ముందు తమ వాదనలను వినిపించారు. జాక్వెలిన్ కు డబ్బు కొరత లేకపోవడంతో ఆమె దేశం నుంచి సులభంగా పారిపోయే అవకాశం ఉందని ఈడీ వాదించింది. అయితే దీనిపై ఆమెను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్తి ఈడీ ప్రశ్నించారు. అయితే ఆమె దేశం వదిలివెళ్లకుండా దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు ఈడీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.

Read Also: Gyanvapi mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినప్పటికీ మీరు విచారణ సమయంలో జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని.. ఇతర నిందితులు జైలులో ఉన్నారు కదా అని వ్యాఖ్యానించింది. పిక్ అండ్ చాయిస్ విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారని న్యాయస్థానం ఈడీని ప్రశ్నించింది. ఇప్పటికే విచారణ పూర్తై ఛార్జిషీట్ దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని ఫెర్నాడెస్ బెయిల్ కోసం కోర్టును కోరింది.

సుఖేష్ చంద్రశేఖర్ వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులను బెదిరించడంతో పాటు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలకంగా ఉన్నాడు. దీంతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉండటంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహి వంటి బాాలీవుడ్ భామలతో సుఖేష్ చంద్రశేఖర్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకి రావడంతో ఈ కేసులో వారి సంబంధాలపై ఈడీ విచారణ చేస్తోంది.

Exit mobile version