NTV Telugu Site icon

Sanjjanaa Galrani: కన్నడ స్టార్ దర్శన్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన నటి సంజన..

Darshan

Darshan

Sanjjanaa Galrani: రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ కావడం కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 33 ఏళ్ల రేణుకాస్వామిని దర్శన్ ఆదేశాల మేరకే అతడి అనుచరులు తీవ్రంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. మరణించిన తర్వాత స్వామి మృతదేహాన్ని డెయినేజీలో పారేశారు. దర్శన్ తన సహనటి పవిత్ర గౌడతో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. భార్య ఉన్నప్పటికీ, తన అభిమాన నటుడితో ఎఫైర్ పెట్టుకున్న పవిత్రను ఉద్దేశిస్తూ రేణుకాస్వామి సోషల్ మీడియాలో విమర్శించడం ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, దర్శన్‌పై కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మాండ్యాలో మృతుడికి మద్దతుగా రైతులు ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో దర్వన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్‌ని చిత్రపరిశ్రమ నుంచి నిషేధించాలని, ఆయన సినిమాలు విడుదల చేయొద్దని బాధితుడి తల్లి డిమాండ్ చేసింది.

Read Also: Stock Market Opening: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 100, నిఫ్టీ 66 పాయింట్లు హైక్

ఇదిలా ఉంటే దర్శన్ సహనటి సంజనా గల్రానీ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఇది ‘‘ ఇండస్ట్రీకి అంతిమ దినం’’ అన్నారు. ఇది నిన్న మాకు బ్లాక్ డే, మరియు ఇది కన్నడ పరిశ్రమకు డూమ్‌డే లాంటిది అని ఆమె అన్నారు. ప్రజలు అతని దర్శన్ సినిమాలు చూడటమే కాదు, అతడిని పూజిస్తారు, అంతపెద్ద వాడు అని చెప్పారు. ఈ ఆరోపణలను పక్కన పెట్టి, దర్శన్ చాలా గౌరవప్రదమైన, సున్నితమైన స్వభావిగా ఆమె పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో తనను నన్ను నా పేరుతో కూడా పిలిచేవారు కాదని, ‘జీ సునియే’, ‘అమ్మ’ అని పిలిచేవారని చెప్పారు. అతడు స్త్రీలను గౌరవించే వారని చెప్పారు.

దర్శన్‌పై వచ్చిన ఆరోపణలు విని షాక్ అయ్యానని సంజనా అన్నారు. ఇది కర్ణాటకలోని ప్రతీ వ్యక్తి ధైర్యాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. వార్తల్లో కనిపించే వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి రెండు వేర్వేరు వ్యక్తిత్వాలుగా భావిస్తున్నాని దర్శన్ గురించి అన్నారు. ఈ విషయంతో తొందరగా నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని, న్యాయప్రక్రియ గురించి అన్నారు. ఒక సెలబ్రెటీ విషయంలో 5 శాతం ఆరోపణ ఉంటే అది 500 శాతం అవుతుందని ఆమె అన్నారు. న్యాయ ప్రక్రియను మనం గౌరవించాలని అన్నారు.